SDPT: బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి లచ్చయ్య కూతురు గొడ్డాటి కోమల ఇంటర్లో ప్రతిభ కనబరిచింది. వర్గల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఆమె, మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది . సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోమల ఈ ఫలితంతో గ్రామ ప్రజల ప్రశంసలు పొందింది.