KNR: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కెట్‌గా పద్మానగర్ సమీకృత మార్కెట్ ఉండబోతుందని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 16వ డివిజన్లో కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు పద్మానగర్‌లో నూతనంగా నిర్మాణం అవుతున్న సమీకృత మార్కెట్‌ను శనివారం సందర్శించారు.