KNR: జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ కమిటీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం దేశానికి దిక్సూచి అన్నారు.