SDPT: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరీ క్షేత్రంలో అక్షయ తృతీయ పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్గల్ శ్రీ విద్యాధరీ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హైమావతికి తీర్థ ప్రసాదాలు అందజేసి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించారు.