BHPL: జిల్లాలో వంటగ్యాస్ సరఫరా సాధారణంగా, నిరంతరాయంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో గ్యాస్ సరఫరా పరిస్థితుల పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.