KMM: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలను మండల పరిషత్ కార్యాలయాలతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శిస్తారు. ఈ జాబితా ఆధారంగా ఖమ్మం జిల్లాలో 8,02,690మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుండగా, పోలింగ్ బూత్ల సంఖ్య 1,572 నుంచి 1,580కి పెరగనుంది.