HNK: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న ‘రుద్రమ-1’ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం (నేడు) ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు అసలైన ప్రయోగం ఉంటుందని, విద్యార్థులు, ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.