SRPT: ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని డీఎస్పీ రవి తెలిపారు. బుధవారం క్రిస్మస్ పురస్కరించుకొని సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కాసింపేట బేతెస్త చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు, వితంతువులకు, చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ఏసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.