KMR: పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.