KMM: చింతకాని మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం హౌసింగ్ ఏఈ సుప్రియ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు తెలియజేసి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చామర్తి కృష్ణమాచారి, మండల కాంగ్రెస్ నాయకులు బందెల నాగార్జున పాల్గొన్నారు.