WGL: నూతనంగా GPఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు బాధ్యతలు చేపట్టి 3 నెలలు గడిచినా గౌరవ వేతనం రూ. 6500 అందడం లేదని రంగాపురం GP సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు ఇవాళ ఆరోపించారు. వేతనాలు అందకపోవడంతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచుల వేతనాలు అందించాలని కోరారు.