MLG: వెంకటాపూర్ మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ. 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మ గుడికి రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం శంకుస్థాపన చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ స్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ తదితరులు ఉన్నారు.