ఖమ్మం: 43వ డివిజన్లో పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి అయినట్లు బీజేపీ రెండో పట్టణ అధ్యక్షులు తాజ్ నూత్ భద్రం తెలిపారు. డివిజన్లోని 175, 176, 177, 179వ పోలింగ్ బూత్ కమిటీల సంబంధించిన పత్రాలను బుధవారం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ సమక్షంలో రెండో పట్టణ ఎలక్షన్ అధికారి అల్లిక అంజయ్య, జిల్లా ఎలక్షన్ అధికారి గెంటేల విద్యాసాగర్‌కు అందజేశారు.