ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా రైతులను మోసం చేస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామని చెప్పి నకిలీ బిల్లులతో ఒక్కో మొక్కకు రూ.370 వసూలు చేస్తున్నారు. తిరుమలాయపాలెం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి వారు రూ.23 వేలు కాజేశారు. దీంతో అపరిచితులకు ఫోన్‌పే, జీపే చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.