KNR: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని వెల్లడించారు. మార్చి 4లోగా tgss.telangana.gov.in వెబ్సైట్లో నమోదుచేసుకోవాలన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.