ములుగు జిల్లా BRS పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కోగిల మహేష్‌పై కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా SC సెల్ నాయకులు గణపాక సుధాకర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కోగిల మహేష్ లాంటి వారు సీతక్క మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ములుగు జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన కొనియాడారు.