ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలి ఆవరణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి తాతా మధు మిర్చి రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా మిర్చి పంటను రూ. 25 వేలకు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.