MDCL: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 12740 రైలు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోగీలు, టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే శుభ్రత చర్యలు తీసుకుని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.