SRD: సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో ఆదివారం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సంగమేశ్వర్, మల్లమ్మ, శ్రీజ, వర్కర్ అమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్కు తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.