ADB: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదవాడి సొంతింటి కలలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ గంగన్న తదితరులున్నారు.