ADB: ఆదిలాబాద్లో ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండీ ధర్మగురువు హీరాసుక జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరాసుక చిత్రపటానికి పూజలు నిర్వహించి, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు. అనంతరం ఆదివాసి సాంప్రదాయ నృత్యంలోనూ పాల్గొన్నారు.