KMR: రాష్ట్ర స్థాయి ఎస్టీఎఫ్ పాఠశాల స్థాయి అండర్ 17 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థిని సృజన ఎంపికైందని వ్యాయామ ఉపాధ్యా యుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఈ నెల 14న కామారెడ్డి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా స్థాయిల్లో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు.