WNP: రంగాపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీరంగనాథ స్వామి రథోత్సవం వైభవంగా కొనసాగుతోంది. దీంతో చుట్టూ జనసంద్రంతో శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం కనువిందు చేస్తోంది. రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.