MNCL: చెన్నూర్ మండలం కంబోజిపేట గ్రామానికి చెందిన పోసక్క అనే వృద్ధురాలు బీపీ పెరిగి కింద పడగా తలకి బలమైన గాయమైంది. కుటుంబీకుల సమాచారంతో స్పందించిన కోటపల్లి 108 సిబ్బంది ఈఎంటీ షహబాజ్ పైలట్ సతీష్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఈఆర్సీపీ వైద్యుని సూచన మేరకు క్షతగాత్రురాలుకి ప్రథమ చికిత్స అందిస్తూ మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు.