TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాలను ఖరారు చేయనున్నారు. అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.