NLG: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిప్పర్తిలో హమాలి కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తున్న కార్మికులకు భద్రత సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.