KMM: చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో సర్పంచ్ కంచం ద్రౌపతి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫార్సుతో మొత్తం రూ. 2,51,500 విలువైన చెక్కులు అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.