ADB: ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నిమ్మల సుప్రియతో కలిసి రూ.39 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రాథమిక వసతులు అందరికీ చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.