NRPT: కృష్ణ మండలంలోని ముడుమాల ప్రాథమిక పాఠశాలను జిల్లా కమ్యూనిటీ మొబైలైజేషన్ ఆఫీసర్ రాజేంద్ర కుమార్, ఎంఈవో బాలాజీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవిత కేంద్రం, తరగతి గది బోధన, విద్యార్థుల సామర్థ్యం, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థుల చేతివ్రాత, పఠనం, గణిత సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.