BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పేరును ‘కొత్తగూడెం-పాల్వంచ కార్పొరేషన్’గా మార్చాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్‌లోని 7 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, పాల్వంచ పేరు చేర్చాలని అక్కడి ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.