JGL: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్లో కోనాపూర్, తిప్పన్నపేట గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెర్వో శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, నక్కల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.