JN: జాఫర్ ఘడ్ మండలంలోని కూనూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ దేవేంద్ర మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సర్పంచ్ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య పాల్గొన్నారు.