ADB: గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.