KMR: జిల్లాలోని కళాభారతి వేదికగా నవంబర్ 4న యువజన వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కళాకారుల బృంద సభ్యులు గురువారం తెలిపారు. పాటలు, వ్యాసరచన, డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలో పాల్గొనదలిచిన యువత వయస్సు 15 నుంచి 29 ఏళ్ల వయస్సు, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 2వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.