RR: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం చౌలపల్లిలో మూడు రోజులుగా విద్యుత్ సరిగ్గాలేక అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ తరలించేందుకు సిబ్బంది రాకపోవడంతో గ్రామస్తులు సబ్ స్టేషన్లో నిరసనకు దిగారు. లో వోల్టేజ్ సమస్యలు తీవ్రంగా ఉందని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.