NZB: TU పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్య అభ్యసిస్తున్న 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించడానికి మరో ఐదు రోజులే గడువు ఉన్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 30 లోపు ఎటువంటి అపరాధ రుసుంలేకుండా చెల్లించవచ్చన్నారు. పూర్తివివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.