MNCL: మందమర్రిలో షాదిఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక మసీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పాల్గొన్నారు. మసీదులో మందమర్రి ఏరియాకు చెందిన నిరుపేద ముస్లింలకు 112 రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ప్రతి ముస్లిం సోదరుడు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.