PDPL: మంథని ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు కేంద్రంలో పనిచేస్తున్న పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటరీ కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని బుధవారం CITU ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగాది రోజున కార్మిక కుటుంబాలు ఉపవాసం ఉండాల్సి వచ్చిందన్నారు . ప్రభుత్వం విడుదల చేసిన వేతనాలను కాంట్రాక్టర్ వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.