MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరేడ్‌కు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌ను పరిశీలించి, అధికారులు మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం (ఫిజికల్ ఫిట్నెస్) ఎంతో అవసరమని సూచనలు చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.