VKB: తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున లంకా దహన మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆదివారం రాత్రి ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల మీదుగా ఊరేగించారు. ఈ ఉత్సవం వందలాది భక్తుల సమక్షంలో ఊరేగింపుగా బసవన్నకట్ట సమీపంలోని లంకా దహన ప్రాంగణానికి చేరుకుంది.