ADB: పెంచికల్ పేటకు చెందిన అమాయక ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసం చేసి హత్యా చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగుదేవ్ పటేల్ డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూరులో మాట్లాడుతూ.. హత్యా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పొరడుతామన్నారు.