MBNR: మిడ్జిల్ మండలంలోని రాణిపేటలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై పంచాయతీ అధికారులు కొరడా ఝళిపించారు. గ్రామంలో చెత్త సేకరణకు ట్రాక్టరు ఉన్నా, కొందరు ఇష్టారాజ్యంగా రోడ్లపై పారేస్తుండటంతో కార్యదర్శి సుదర్శన్ ఐదు ప్రాంతాలను గుర్తించారు. అక్కడ చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఆదివారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.