KNR: రైతుల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయాలను సదా కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న 15వ వర్ధంతి కార్యక్రమం రోజున జమ్మికుంటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదివేల మందితో సభ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.