ADB: జిల్లాలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 9 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలను జిల్లా పంచాయతీ అధికారి రమేష్ వెల్లడించారు. ఇచ్చోడ 9.7 శాతం, సిరికొండ 20.87 శాతం, ఇంద్రవెల్లి 6.17 శాతం, ఉట్నూర్ 10.56 శాతం, నార్నూర్ 11.99 శాతం, గాదిగూడ 14.29 శాతంగా ఉందన్నారు. ఆరు మండలాల్లో సరాసరి ఓటింగ్ 10.67 శాతంగా నమోదయిందని పేర్కొన్నారు.