HNK: కాజీపేట మండలం మడికొండ శివారులొ రాధిక పౌల్ట్రీ ఫారంలో పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹30,250 నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు నిమిత్తం మడికొండ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.