NLG: చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వేళ తన వార్డులోని ప్రతి పేద ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ. 10,016లు ఆర్థిక సాయం అందిస్తానని వాగ్దానం చేశారు. అంబేద్కర్ నగర్‌కు చెందిన సుంకరి రాజేశ్వరి వివాహనికి ఇవాళ హాజరై, ఆ నగదును అందించారు.