WGL: నర్సంపేటలోని స్కానింగ్ సెంటర్లో కడుపునొప్పితో వచ్చిన మైనర్ బాలికకు గర్భం దాల్చిందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఘటన సోమవారం సాయంత్రం కలకలం రేపింది. దీంతో రేడియాలజిస్ట్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై DMHO స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.