BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపై సాగుతున్న వర్తక వ్యాపారాల దోపిడీని అరికట్టాలని కోరుతూ స్థానిక భక్తుడు వెంకటేశ్ వినూత్నంగా నిరసన తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి వేషధారణలో వచ్చిన ఆయన.. దేవదాయ శాఖ కమిషనర్, EOలకు వినతి అందజేశారు. కొండపై షాపులకు టెండర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని, దోపిడీదారుల నుంచి భక్తులను కాపాడాలన్నారు.