HYD: కొత్తపేటకు చెందిన ఓ విద్యార్థి రూ.99కు గణేశుడి లడ్డూ సొంతం చేసుకున్నాడు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా కొత్తపేటలోని శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కోసం లక్కీ డ్రా నిర్వహించారు. దీనికి సుమారు 760 టోకెన్లను విక్రయించగా.. ఈ లక్కీ డ్రాలో బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ విజేతగా నిలిచి 333 కిలోల లడ్డూని సొంతం చేసుకున్నాడు.