NRML: జిల్లా జయశంకర్ చౌరస్తాలో విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. పౌర సంబంధాల శాఖ సాంస్కృతిక బృందాలు పాటల ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విజయవంతంగా జరిగింది.